Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 11:32:14
facebook Twitter Googleplus
Photo

రేణు దేశాయ్... తెలుగు ప్రజలకు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. టాలీవుడ్ ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భార్యగా రేణు... అందరికీ చిరపరచితమే. వెండి తెరపై కనిపించింది చాలా తక్కువే అయినా.. పవన్ కల్యాణ్ తో పెళ్లితో ఆమె బాగానే పాపులర్ అయ్యింది. పెళ్లి కంటే కూడా పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పేరు మరింతగా పాపులర్ అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పవన్ నుంచి విడిపోయిన రేణు ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. గడచిన మూడు - నాలుగేళ్ల దాకా అంతగా బయటకు రాని రేణు... ఇటీవలి కాలంలో ప్రతి విషయంపై బాగానే రియాక్ట్ అవుతోంది. ఈ క్రమంలో అడిగిన ప్రతి మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇస్తున్న రేణు... పవన్తో తన వైవాహిక బంధం - విడాకులు తీసుకోవడానికి కారణాలు - విడిపోయిన తర్వాత తన లైఫ్ స్టైల్ - పిల్లల పోషణ - కొత్తగా చేపట్టిన దర్శకత్వ బాధ్యతలు తదితర వివరాలన్నింటినీ కూడా ఆమె చాలా వివరంగానే చెప్పుకొస్తున్నారు.

రేణుతో విడాకులు తీసుకున్న మరుక్షణమే పవన్ కల్యాణ్ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే రేణు మాత్రం ఇప్పటికీ రెండో పెళ్లి అనే మాటే లేకుండా బతికేస్తున్నారు. ఇప్పటికీ వయసులో అంత పెద్దదేమీ కాకున్నా... ఎందుకో గానీ రేణు రెండో పెళ్లి దిశగా అడుగులు వేయడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే సెకండ్ మ్యారేజ్ దిశగా ఆమె ఆలోచన చేస్తోందన్న భావన కలుగుతోంది. ఇందుకు నిదర్శనంగానే ఇటీవల ఓ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర కామెంట్లు చేసింది. రెండో పెళ్లి వద్దన్న భావన నుంచి... అప్పుడే వయసేమీ పైబడలేదు కదా.. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముందన్న భావన తన మదిలో మొగ్గ తొడుగుతోందని ఆమె వ్యాఖ్యానించింది.

రేణు చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే... రెండో పెళ్లి చేసుకునే విషయంలో చాలా కన్ ఫ్యూజ్ గా ఉన్న నేపథ్యంలో ఇటీవలే ఓ కౌన్సిలర్ వద్దకు వెళ్లాను. నాలో ఉన్న భావనలన్నీ చిందరవందరగా ఉన్న విషయాన్ని సదరు కౌన్సిలర్.. ఓ ఆర్డర్ లో పెట్టింది. అయినా సరే... ఆమె కూడా రెండో పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేంటంటూ ఓ ప్రశ్న వేసింది. అయితే దీనిపై నా నుంచి తొలి సమాధానమే మళ్లీ వచ్చేసింది. నా భావోద్వేగాలను మరో వ్యక్తికి పంచడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే... ఏదో కావాలనే ఆశ చాలా బాధను ఇస్తుంది. భవద్గీతలోనే శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు. ఈ బేసిక్ ఫిలాసఫీ ఆధారంగానే రెండో పెళ్లి అంటే అంతగా ఆసక్తి ఉండటం లేదు. అంతేకాకుండా ఇకపై ఏదీ కావాలని కోరుకోవడం లేదు. అందుకే చేతిపై స్తిత ప్రజ్ఞ అనే మాటను పచ్చబొట్టుగా వేయించుకున్నాను. అయినా సాధువులు ఒంటరిగా లేరా? నా వయసు ఇంకా 30ల్లోనే ఉంది కదా. నాకు 50 ఏళ్లో 60 ఏళ్లో వచ్చాక... వెనక్కు తిరిగి చూసుకుంటే... 30ల్లో నాకు ఓ మనిషితో సంబంధం ఉండేది. భర్త ఉండేవాడు. వైవాహిక జీవితం కూడా ఉండేది. ఎంత భర్త ఉన్నా... నా పిల్లలకు సవతి తండ్రి కిందే లెక్క కదా. అయినా నా జీవితంలో ఆ వ్యక్తే ఇప్పటికీ నా జీవితంలో ఉన్నాడు. ఇదే ఇప్పటిదాకా నా మనసులోని భావన. గతేడాది దాకా ఇదే భావనతో ఉన్నాను.

రెండో పెళ్లి అన్న మాటే లేకుండా జీవించాలన్నదే ఆ భావన. ఎందుకంటే... జీవితాంతం గుర్తుండే వైవాహిక అనుభవాలున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే.. రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అన్న ఆలోచనలు వస్తున్నాయి. భౌతికంగా కాకపోయినా... కనీసం మనసులోనైనా ఆ దిశగా ఓపెన్ కావాలన్న భావన కలుగుతోంది. ఆ క్రమంలోనే మానసికంగా రెండో పెళ్లి దిశగా దాదాపుగా ఓపెన్ అయిపోయా. అయినా ఇప్పటికీ ఆ భావనే నన్ను భయపెడుతోంది. ఎందుకంటే బంధం బెడిసికొడితే ఉండే నొప్పి ఎలా ఉంటుందో ఇప్పటికే అనుభవించా. అందుకే ఈ జర్నీ ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు. అయినా రెండో పెళ్లి నా జీవితంలో రాసి ఉందో? లేదో? అయితే సెకండ్ రిలేషన్ షిప్ లో మాత్రం ప్రేమ ఉండదు. మళ్లీ ప్రేమలో పడతానో లేదో తెలియదు. మళ్లీ ప్రేమలో పడినా... తొలి బంధంలానే జరుగుతుందా? అయితే అలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తదనే అనుకుంటున్నా. ఎదేమైనా సింగిల్గా ఉండటం అలవాటైపోయిది. ఇప్పటికీ ఫ్రెండ్స్ నాపై జోకులేస్తూనే ఉంటారు. ఎన్ని జోకులేసినా... నేను సింగిల్ గా ఉన్నా... ఇతర సింగిల్స్లా అగ్లీగా మాత్రం కనిపించనని వారంతా అంటూ ఉంటారు.

,  ,  ,  ,  ,