Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2017 11:01:56
facebook Twitter Googleplus
Photo

అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఉత్తరాది భామ షాలినీ పాండే. మొట్ట మొదటి సినిమాలోనే ఇటు బోల్డ్ సీన్స్ లో నటించి లిప్ కిస్ లతో వెండితెరను వేడెక్కించింది. అదేటైంలో కదిలించే నటనతో ప్రేక్షకులకు కట్టిపడేసింది. మొత్తం మీద అర్జున్ రెడ్డి సినిమాతో ఈ సొట్ట బుగ్గల సుందరి ఇండస్ట్రీని బాగా అట్రాక్ట్ చేసింది.

అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించగానే కోలీవుడ్ నుంచి అమ్మడికి ఫస్ట్ ఆఫర్ వచ్చింది. అప్పట్లో నాగచైతన్య - తమన్నా జంటగా నటించిన 100% లవ్ సినిమాను ఇప్పుడు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఇందులో హీరోగా నటిస్తుండగా షాలినీ పాండే హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇంతలోనే ఈ భామకు కోలీవుడ్ లో ఇంకో అవకాశమొచ్చిందని తెలుస్తోంది. రంగం సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా చేయబోయే నెక్ట్స్ మూవీలో హీరోయిన్ గా షాలినీని తీసుకోబోతున్నారనేది కోలీవుడ్ లేటెస్ట్ టాక్. సినిమా స్క్రిప్ట్ విని చేయడానికి ఆమె పచ్చ జెండా ఊపిందని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

షాలినీ పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది తెలుగు సినిమాతోనే. కానీ ఇక్కడ ఆమెకు ఇంతవరకు వచ్చిన ఆఫర్ మహానటి సినిమాలో మాత్రమే. అదీ మెయిన్ హీరోయిన్ పాత్రకాదు. కానీ తమిళంలో రెండు ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.

,  ,  ,  ,  ,