Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2016 14:27:41
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి తరువాత అతని కుటుంబం నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో కథానాయకులు వచ్చారు. పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ - రామ్ చరణ్ - సాయి ధరమ్ తేజ్ - అల్లు శిరీష్ - వరుణ్ తేజ్.. ఇలా ఈ జాబితా పెరుగుతూనే ఉంది. చిరు అనంతరం వచ్చిన ఈ మెగాక్యాంప్ హీరోలందరికి కొన్ని పాజిటివ్ సెంటిమెంట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి వారి రెండో చిత్రాలు - నాలుగో చిత్రాలు మంచి ఫలితాలనే రాబట్టడం.

రెండో సినిమాల విషయానికి వస్తే.. గోకులంతో సీత రూపంలో పవన్ కి - ఆర్య రూపంలో బన్నికి - మగధీర రూపంలో చరణ్ కి - పిల్లా నువ్వు లేని జీవితం (సంతకం చేసిన రెండో సినిమా) రూపంలో సాయిధరమ్ కి - కొత్త జంట రూపంలో శిరీష్ కి - కంచె రూపంలో వరుణ్ కి యావరేజ్ నుంచి బ్లాక్ బస్టర్ ఫలితాలు దక్కాయి. ఇక నాలుగో చిత్రాల విషయానికి వస్తే.. తొలిప్రేమతో పవన్ - రచ్చతో చరణ్ - సుప్రీమ్ తో సాయిధరమ్ విజయాల బాట పట్టారు. ఇక బన్నీకి హ్యాపీ యావరేజ్ రిజల్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వరుణ్ కి కూడా నాలుగో చిత్రం మిస్టర్.. సెంటిమెంట్ ప్రకారం పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందేమో చూడాలి. లావణ్య త్రిపాఠి - హేబా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న మిస్టర్ కి శ్రీను వైట్ల దర్శకుడు

,  ,  ,  ,  ,  ,