Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Nov-2016 11:26:16
facebook Twitter Googleplus
Photo

బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేష్.. ఇప్పటికే షూటింగ్ లో తెగ బిజీగా ఉంది. దానికితోడు అమ్మడు పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు సినిమాల్లో ఛాన్సులు కొట్టేయడం టాక్ ఆఫ్ ది టాక్ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ తన సినిమాల సంతకాలతోనే కాదు.. నిజంగా లొకేషన్లో తన లుక్స్ తో అందరినీ ఆకట్టిపాడేస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్స్ ఆడిటోరియం దగ్గర ''నేను లోకల్'' సినిమా షూటింగులో పాల్గొంటోంది కీర్తి సురేష్. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సీన్లను అక్కడ తీస్తున్నారు. అయితే లైవ్ లో కీర్తి సురేష్ ను చూస్తున్న చాలామంది ఆడియన్స్ అందరూ.. వావ్ చాలా బాగుందే ఈ అమ్మాయి అంటూ లొట్టలేస్తున్నారు. పైగా బయట చూస్తే అంత బొద్దుగా కూడా లేదని.. చాలా అందంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి బయట అమ్మడిని చూసినోళ్ళంతా వీర ఫ్లాటైపోయారనమాట.

అయితే తెలుగులో కమర్షియల్ సినిమాలను చేస్తూ.. అస్సలు ఏమాత్రం గ్లామర్ డోస్ కు స్కోప్ ఇవ్వకపోయినా కూడా.. కీర్తి సురేష్ కు వరుసబెట్టి ఆఫర్లు వచ్చేస్తున్నాయి. బహుశా ఆమె ఆన్ స్క్రిన్ లుక్స్ అండ్ యాక్టింగ్ లో ఉన్న మ్యాజిక్ ప్రభావం కాబోలు!

,  ,  ,  ,  ,  ,