Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2016 11:07:11
facebook Twitter Googleplus
Photo

నీ అభిమాన కథానాయకుడు ఎవరని అడిగితి టక్కున సూర్య అని చెబుతుంది జబర్దస్త్ పోరి రష్మి. మరి తన కలల హీరోతో కలిసి నటించే అవకాశం ఆమెకి ఎప్పుడొస్తుందో తెలియదుకానీ... సూర్య సినిమాతోపాటు సందడి చేసే అవకాశం మాత్రం ఆమెకి లభించింది. అదెలాగంటారా?

మే 6న సూర్య `24` విడుదల కాబోతోంది. ఆ సినిమాతో పాటే రష్మి నటించిన చారుశీల ట్రైలర్ని విడుదల చేయబోతున్నారు. అంటే సూర్యసినిమాలు చూసినోళ్లకి రష్మి అందాల ఆఫర్ అన్నమాట. విరామం సమయంలో రష్మి చారుశీలగా కాసేపు సందడి చేస్తుంది. ప్రముఖ దర్శకుడు సాగర్ నిర్మాణంలో వి.శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా తెరకెక్కిన సినిమా చారుశీల. అందులో రాజీవ్ కనకాల - రష్మి కలిసి నటించారు. ఒక హారర్ ఎలిమెంట్ తో రూపుదిద్దుకున్న ఆ సినిమాలో రష్మి తనదైన శైలిలో ఘాటైన అందాలతో కనువిందు చేయనుందని సమాచారం.

ఆమధ్య వచ్చిన గుంటూరు టాకీస్ సినిమాకి కూడా రష్మి అందాలే ప్లస్సయ్యాయి. రష్మి పోస్టర్ ని చూసి కుర్రకారు తెగ చూసేశారు ఆ సినిమాని. ఇప్పుడు మళ్లీ రష్మిని చూసే వాళ్లు చారుశీల థియేటర్ల దగ్గర క్యూ కడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. రష్మికైతే ఈసినిమా అంత ముఖ్యం కాదు కానీ దర్శకనిర్మాతలు ఆమె పైనే హోప్స్ పెట్టుకొన్నారు. మరి రెండోసారి కూడా తన గ్లామర్ తో రష్మి మేజిక్ చేస్తుందేమో చూడాలి.

,  ,  ,  ,  ,  ,