Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jun-2016 14:58:47
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో కమెడియన్స్ చాలామందే ఉంటారు కానీ.. పేరు వినగానే నవ్వు తెప్పించగలిగే మొనగాళ్లు మాత్రం కొందరే. సునీల్ ఈ జాబితా నుంచి తప్పుకుని హీరో అయిపోయాక.. ఆ ప్లేస్ లో బ్రహ్మానందం - ఆలీలు మాత్రమే మిగిలారు. వీళ్ల రేంజ్ కాస్త తగ్గిన తర్వాతే మిగిలిన ఎవరైనా కుదురుకోగలిగారు అని చెప్పచ్చు. కమెడియన్లుగా ఉంటూ డాక్టరేట్ పట్టాలు అందుకున్న మహామహులు వీళ్లిద్దరూ.

గత కొంత కాలంగా వీళ్లకి ఆఫర్లు తగ్గుతున్న మాట వాస్తవమే. ఎవరు ఛాన్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లో మాత్రం వీళ్ల హంగామా కనిపించడం కామన్. ఖలేజా - జల్సా - జులాయి - అత్తారింటికి దారేదితో పాటు గతేడాది సన్నాఫ్ సత్యమూర్తిలో కూడా వీళ్లు కనిపించారు నవ్వులు పూయించారు. ఇప్పుడు అ..ఆ.. వచ్చింది ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటోంది. కానీ సినిమాలో మాత్రం ఆలీ - బ్రహ్మానందంల జాడ ఎక్కడా లేదు.

త్రివిక్రమ్ సినిమాలో ఈ సీనియర్ నవ్వులరాయుళ్లు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రవీణ్ తో పాటు మరికొంతమంది కమెడియన్స్ సినిమాలో ఉన్నా.. త్రివిక్రమ్ మార్క్ పంచ్ లకు వీళ్లు అంతగా ఆనలేదని ఒప్పుకోవాల్సిందే. బహుశా ఈ సినిమాని కాస్త తక్కువ బడ్జెట్ లో తీయాలనే ఉద్దేశ్యంతో.. ఈ కాస్ట్లీ కమెడియన్స్ ని పక్కన పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై వాస్తవం చెప్పాలంటే మాత్రం త్రివిక్రమ్ ఒక్కడికే సాధ్యం. మరి మాంత్రికుడితో చెప్పడం మాత్రం అంత తేలిక కాదనే విషయం తెలిసిందే కదా.

,  ,  ,  ,  ,  ,  ,  ,