Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2016 12:45:42
facebook Twitter Googleplus
Photo

ఎంతైనా సూపర్ స్టార్ సూపర్ స్టారే. ఆయన సినిమా వస్తోందంటే ఉండే హైపే వేరు. రెండు వరుస డిజాస్టర్ల తర్వాత రెండు సినిమాల అనుభవం ఉన్న ఓ యువ దర్శకుడితో రజినీ ?కబాలి? సినిమా మొదలుపెట్టినపుడు నిజానికి అంత హైప్ లేదు. గత కొన్నేళ్లలో రజినీ సినిమా ఇంత లో ప్రొఫైల్ గా మొదలవడం.. షూటింగ్ జరుపుకోవడం కూడా ఇదే తొలిసారి. ఐతే ఎప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిందో అప్పుడే పరిస్థితి మారిపోయింది. ఇక టీజర్ వచ్చాక పరిస్థితేంటో చెప్పాల్సిన పని లేదు. అనుకున్న దాని కంటే హైప్ పెరిగిపోవడం.. అంచనాలు ఎక్కువైపోవడంతో కొన్ని రోజులుగా లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది కబాలి టీం. ఇంతకుముందు భారీ స్థాయిలో చేయాలనుకున్న ఆడియో వేడుకను రజినీ లేకుండానే సింపుల్ గా ముగించేశారు. తమిళంలో విడుదలైన ?కబాలి? పాటలకు మంచి రెస్పాన్సే వస్తోంది. ఆడియోతో పాటు కొన్ని కొత్త పోస్టర్లు కూడా రిలీజ్ చేశాడు నిర్మాత కలైపులి థాను.

అందులో రజినీకాంత్ అవతారం చూసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. 80ల నాటి లుక్ లో దర్శనమిస్తున్నాడు సూపర్ స్టార్. ?కబాలి?ని ఇప్పటిదాకా మిడిలేజ్డ్ గ్యాంగ్ స్టర్ లాగే చూశారు కానీ.. తాజా పోస్టర్లలో మాత్రం పక్కా ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నాడు రజినీ. రాధికా కూడా ట్రెడిషనల్ లుక్ లో చాలా బాగా కనిపిస్తోంది. ఈ పోస్టర్లు చూశాక సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. తెలుగు ఆడియోను నేరుగా మార్కెట్లోకి విడుదల చేయబోతోంది కబాలి టీమ్. అనుకున్న ప్రకారమే జులై 1న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారు.

,  ,  ,  ,  ,