Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jan-2017 13:50:05
facebook Twitter Googleplus
Photo

శుక్రవారం ఉదయం పవన్ ప్రెస్ మీట్ అనంతరం దర్శకుడు రాం గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. విశాఖ ఉద్యమానికి పవన్ మద్దతు తెలిపిన నేపథ్యంలో వరుస ట్వీట్ల తో ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై తాజా ప్రెస్ మీట్ లో పవన్ స్పందించారు. ఆర్జీవి ట్వీట్ల ప్రస్థావన వచ్చిన క్రమంలో... "రాంగోపాల్ వర్మకు ప్రస్తుతం ఓ 50 ఏళ్లు ఉంటాయనుకుంటా.. పెళ్లైన ఓ కూతురు కూడా ఉందాయనకు.. కానీ ఆ పెద్దమనిషి పొద్దున లేస్తే పోర్న్ సినిమాలు చూస్తానని చెప్పుకుంటాడు.. అలాంటి వాళ్లకి సమాధానం చెప్పలేను" అని పవన్ స్పందించారు. ఈ విషయాలపై తాజాగా వర్మ మరో సారి ట్వీట్ చేశారు.

ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ మీద అంచనాలతో మాట్లాడానే గాని మరో ఉద్దేశ్యంతో కాదని పర్సనల్ విషయాలు తానెప్పుడూ మాట్లాడలేదని వర్మ అన్నారు. ఇదే క్రమంలో... తన జీవితం లైఫ్ స్టైల్ గురించి "నా ఇష్టం" పుస్తకంలో మొత్తం వివరించి చెప్పిన విషయాన్ని వర్మ మరోసారి తెలిపారు. "వాళ్ల ఇంట్లో వాళ్లను గురించి మాట్లాడారని యండమూరిని తిట్టారు.. మరి వాళ్లు వేరే ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాశం?" అని పవన్ ను ప్రశ్నించారు వర్మ.

అలాగే... పవన్ మీద ఉన్న ఇష్టంతో నిజాయితీగా నిన్న ట్వీట్లు చేశానే తప్ప - విమర్శించాలని కాదని.. ఆ విషయం పవన్ గ్రహించకపోవడం తన దురదృష్టం అని వర్మ అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్లలో చివరిగా స్పందించిన వర్మ... పవన్ కు - అతని పిల్లలకు - భార్యకు - తన కుటుంబానికి - జనసేన పార్టీకి - అభిమానులకు ఆల్ ది బెస్ట్ చెప్పి ముగించారు.

,  ,  ,  ,  ,  ,