Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 10:32:10
facebook Twitter Googleplus
Photo

ఒక టైంలో రామ్ గోపాల్ వర్మ ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ మీదే ఉండేది. అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ టైంలో పవన్ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయి.. అతడిని ?సునామీ స్టార్? అని అభివర్ణించేసి కొన్నాళ్ల పాటు అదే పనిగా పొగిడాడు వర్మ. అప్పుడు పవన్ అభిమానులకు బాగానే అనిపించింది. కానీ తర్వాత రూటు మార్చాడు. పవన్ మీద సెటైర్లు మొదలుపెట్టి.. అంతకంతకూ డోస్ పెంచుతూ పోయాడు. చివరికి పవన్ అభిమానుల తాకిడి తట్టుకోలేకో.. ఇంకో కారణంతో సైలెంటయ్యాడు. ఈ మధ్య మళ్లీ వర్మ ఫోకస్ పవన్ మీద పడుతున్నట్లుంది.

ఈ మధ్య పవన్ పెట్టిన సభల మీద స్పందించిన వర్మ.. తాజాగా క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతి నేపథ్యంలో పవన్ పెట్టిన ట్వీట్ మీద రెస్పాండయ్యాడు. తాను ఎంతగానో అభిమానించే చేగువేరాకు ఆదర్శంగా నిలిచిన క్యాస్ట్రో గురించి పవన్ గొప్పగా మాట్లాడుతూ నివాళి అర్పించిన నేపథ్యంలో వర్మ స్పందిస్తూ.. ??పవన్ కళ్యాణ్ కాంప్లిమెంట్ తర్వాత చేగువేరా ఆత్మ ఇప్పుడు ప్రశాంతంగా ఉండదు. లేచి గెంతులేస్తూ నృత్యం చేస్తూ ఉంటుంది. ఐతే నేను మాత్రం చేగువేరా కంటే కూడా పవన్ కళ్యాణ్ నే ఎక్కువ అభిమానిస్తా అని వర్మ ట్వీట్ చేశాడు. ఐతే ఈ ట్వీట్ చూశాక.. ఆర్జీవీ పవన్ కు నిజంగా కాంప్లిమెంట్ ఇచ్చాడా.. లేక సెటైరేమైనా వేశాడా తెలియక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.

,  ,  ,  ,  ,  ,