Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jan-2017 11:04:08
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150 సందడి విపరీతంగా నడుస్తోంది. ప్రిరిలీజ్ ఈవెంట్ పై అనుమానాలు తలెత్తినా చివరకు గుంటూరు సమీపంలోని హాయ్ ల్యాండ్ లో నిర్వహించేందుకు సిద్ధమైంది ఖైదీ యూనిట్. మరోవైపు రోజూ రకరకాల పోస్టర్లు ఇస్తూ హైప్ మరింతగా పెరిగేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఇచ్చిన ఓ పోస్టర్ ని అయితే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకి పీకి పారేశాడు. 'ఈ పోస్టర్ చూశాక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోంచి సగం శిల్పాలు బయటపడేయాల్సిందే. ఇలాంటి పోజ్ ఇచ్చేందుకు మెగాస్టార్ ని ఒప్పించిన డిజైనర్.. డైరెక్టర్ల కాళ్లకు దండం పెట్టాలి' అన్న వర్మ అక్కడితో ఆగకుండా మరిన్ని ట్వీట్స్ పెట్టాడు. 'ఇలాంటి పోజ్ ఇచ్చేందుకు మెగాస్టార్ ని కన్విన్స్ చేసన టీం మెంబర్ల పేర్లు ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఈ డిజైనర్ కి సినిమా చరిత్రలో కొన్ని పేజీలు ఉండాల్సిందే' అంటూ విమర్శించాడు.

నిజానికి చేతిలో కత్తి పట్టుకుని ఓ ఐరన్ బాక్స్ పై కూర్చుని మెగాస్టార్ ఇచ్చిన ఈ పోజ్ అంత గొప్పగా ఏం లేదనే వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న టైమ్ లో ఇలాంటి నిరుత్సాహకర పోస్టర్ ఇచ్చినందుకు వర్మ బాగా హర్ట్ అయినట్లున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,