Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2017 10:29:17
facebook Twitter Googleplus
Photo

చందమామ కథలు.. ఈడు గోల్డ్ ఎహె మూవీస్ లో కనిపించిన రిచా పనాయ్.. మలయాళ.. కన్నడ సినిమాల్లో కూడా అదృష్టం పరీక్షించేసుకుంది. అయితే.. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రలు అన్నీ ఒకెత్తు.. ఇప్పుడు తెరకకెక్కుతున్న రక్షక భటుడు మూవీలో తాను చేసిన పాత్ర మరొక ఎత్తు అంటోంది రిచా.

ఇన్నేళ్లూ నన్ను గ్లామరస్ పాత్రల్లోనే ఆడియన్స్ చూశారు. కానీ ఇప్పుడు రక్షక భటుడు చూశాక మాత్రం.. రిచా పనాయ్ ఇలా చేసిందా అని ఆశ్చర్యపోతారు. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో.. అంతగా షాక్ ఇవ్వబోతున్నాను అని ధీమాగా చెబుతోంది రిచా పనాయ్. ఈ సినిమాలో నా పాత్ర పేరు మైథిలి. అమాయకురాలైన ఈ మైథిలి.. ఓ ప్రాబ్లెంతో పోలీస్ స్టేషన్ కు వెళుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందనేదే ఈ సినిమా. నా పాత్రను స్క్రీన్ పై చూసిన వాళ్లు థ్రిల్ ఫీలవుతారు అని చెప్పిన రిచా.. హీరోయిన్స్ గ్లామర్ గా కనిపించాలని.. కానీ అవకాశం వస్తే మాత్రం కొత్తగా కనిపించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని చెబుతోంది రిచా.

రక్షక భటుడు మూవీలో నా పై ఓ ఐటెం సాంగ్ కూడా ఉంటుంది. ఇది కావాలని సెట్ చేసినది కాదు. సినిమాలో ఉండేది ఈ ఒక్క పాటే కాగా.. అది కూడా సిట్యుయేషన్ ప్రకారమే వస్తుంది' అని చెప్పింది రిచా.

,  ,  ,  ,  ,