Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Aug-2016 14:50:09
facebook Twitter Googleplus
Photo

పెళ్లి చూపులు హీరోయిన్ రీతూవర్మ గూఢచారి ఆఫర్ను తిరస్కరించించింది. అడవి శేష్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించనున్న ?గూఢచారి?లో హీరోయిన్‌గా రీతూ వర్మకి అవకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని ఆమె వదులుకుంది. నిఖిల్ సినిమా కారణంగా ఆమె ఈ ఆఫర్ ను తిరస్కరించినట్టు సమాచారం.

?స్వామి రారా? తో ఆకట్టుకున్న నిఖిల్- సుధీర్ వర్మ కాంబినేషన్ వైపే ఆమె మొగ్గు చూపింది. అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది. సెప్టెంబర్ 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. చిత్రీకరణ అంతా కాకినాడ టు విశాఖ తీరప్రాంతంలోనే జరుగుతుందని దర్శకుడు సుధీర్‌వర్మ తెలిపారు.

,  ,  ,  ,  ,  ,  ,