Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Aug-2016 15:50:05
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్ ఖాతాలో ఒక్క సూపర్ హిట్ పడితే చాలు వాళ్ళ జాతకం యిట్టె మారిపోతుంది. తాజాగా అలాంటిదే హీరోయిన్ రీతూ వర్మ కు జరిగింది. పెళ్లి చూపులు చిత్రం తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని రాత్రి రాత్రికి స్టార్ హీరోయిన్ అయిపొయింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజను కు పైగానే సినిమా లు ఉన్నాయట.

?పెళ్లి చూపులు? చిత్రానికి ముందే కమిట్ అయినా సినిమా నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంద‌ట‌.. క్షణం ఫేమ్ అడవిశేష్ తో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసుకుంది. అది కూడా 11 లక్షలకు ఒప్పుకుందట రీతూ.

పెళ్లి చూపులు పెద్ద హిట్ అయేసరికి అడవి శేష్ తోనా..సారీ..నేను అలాంటి చిన్న హీరో తో చేయను అనేసిందట. దాంతో అవాక్కయిన అభిషేక్ పిక్చర్స్ వాళ్లు, సరే మాదే నిఖిల్-సుధీర్ వర్మ ప్రాజెక్టు కూడా వుంది. ఆ సినిమా చేసుకోండి అన్నారట.

నిఖిల్ అయితే కాస్త బెటర్ కానీ 11 లక్షల రెమ్యూనిరేషన్ చాలదు. కనీసం 15 లక్షలకు పైన అయితేనే చేస్తాను అని మరో షాక్ ఇచ్చిందట. దీంతో ఒక్క హిట్ తోనే అమ్మడికి కళ్ళు నెత్తికి ఎక్కాయే అని సదరు నిర్మాతలు వాపోతున్నారట

,  ,  ,  ,