Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2016 12:42:54
facebook Twitter Googleplus
Photo

ఇండియన్ ఫిలిం హిస్టరీలో సెన్సేషన్స్ సృష్టించడం ఖాయం అనే అంచనాలున్న మూవీ బాహుబలి ది కంక్లూజన్. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీలింగ్స్ ని స్టార్ట్ చేశారు నిర్మాతలు. బాహుబలి2 ఓవర్సీస్ హక్కులు ఇప్పటికే ఓసారి చేతులు మారి మళ్లీ.. ఆర్కా మీడియా వారి చేతికే వచ్చేశాయనే ఓ టాక్ ఉంది. అలా వెనక్కి తీసేసుకున్న రైట్స్ ను.. ఇప్పుడు మరో పంపిణీదారుడు గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ కి భారీ మొత్తానికి అమ్మేశారని టాక్. సదరు పంపిణీదారుడు కూడా అవునూ అంటూ కన్ఫర్మేషన్ ఇచ్చేశారులే.

తెలుగు.. తమిళ్.. హిందీ.. మలయాళ వెర్షన్లు మొత్తానికి కలిపి బాహుబలి2 ఓవర్సీస్ రైట్స్ రూపంలో 45 కోట్లకు డీల్ సెట్ అయిందని తెలుస్తోంది. ఓ తెలుగు సినిమాకి ఈ రేంజ్ లో ఓవర్సీస్ బిజినెస్ జరగడం ఇప్పట్లో బ్రేక్ చేయలేని రికార్డ్ అనాల్సిందే. ఇప్పటికే 2017 ఏప్రిల్ 28 రిలీజ్ డేట్ కావడంతో.. యూఎస్ఏ- కెనడాల్లో నాలుగు భాషలకు సంబంధించి గ్రాండ్ రిలీజ్ కి గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే.. హిందీ వెర్షన్ వరకూ కమీషన్ బేసిస్ పై రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. మిగిలిన వెర్షన్లకు మాత్రం హోల్ అండ్ సోల్ గా ఓవర్సీస్ హక్కులు ఈ కంపెనీ దగ్గరే ఉన్నాయి.

గతంలో పోకిరి.. కిక్.. రీసెంట్ గా రన్ రాజా రన్.. టెంపర్.. బాద్ షాలతో పాటు మలయాళ ప్రేమమ్ చిత్రాన్ని కూడా ఈ సంస్థ రిలీజ్ చేసింది. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ తమ సంస్థ స్థాయిని మరింత పెంచుతుందని గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ నమ్మకంగా ఉంది.

,  ,  ,  ,  ,  ,