Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 19:16:06
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో గతేడాది రిలీజైన 'బాహుబలి-ది బిగినింగ్' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ. 650 కోట్ల బిజినెస్ చేసింది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ బాహుబలి సినిమా చూడాలనే ఆసక్తి రేకెత్తించింది. ప్రస్తుతం రాజమౌళి చిత్రం యొక్క రెండో భాగం 'బాహుబలి-ది కంక్లూజన్' మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 14, 2017లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాల భారీగా ఉన్నాయి. రెండో భాగం రూ. 1000 కోట్ల బిజినెస్ మార్కను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. సౌత్ లో బాహుబలి-2తో పాటు భారీగా తెరకెక్కుతున్న మరో చిత్రం భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రోబో-2.0'. రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లతో తెరక్కెతున్న ఈ చిత్రం కూడా 200 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అయితే ఇటీవలో ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయనేది ఆ వార్తల సారాంశం. ఒక వేళ అలా జరిగితే భారీ నష్టం తప్పదని, నష్టం వందల కోట్లలో ఉంటుందని పరిశ్రమ వర్గాలు అందోళన చెందుతున్నాయి. అయితే ఈ విషయమై బాహుబలి స్టార్ రానా క్లారిటీ ఇచ్చారు

,  ,  ,  ,  ,  ,