Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Oct-2016 15:20:08
facebook Twitter Googleplus
Photo

చెప్పిందే మళ్లీ మళ్ళీ చెబుతుంటే అదేదో నాన్న-పులి కథలా తయారైంది. ఈసారి నిజంగానే పులి వచ్చినా కూడా నాన్న కూడా రియాక్ట్ అవ్వడు. అయితే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్లు.. ఆ ఆఖరి సారి కూడా కొడుకు పిలువగానే నాన్న వెళ్ళుంటే.. పులి బారిన పడిన కొడుకును కాపాడుకుని ఉండేవాడు అన్నచందాన.. ప్రభాస్ పెళ్ళి గురించి ఎన్నిసార్లు రూమర్లు వచ్చినా.. మీడియా త్రివిక్రమ్ స్ట్రాటజీయే ఫాలో అవుతోంది.

ఇప్పుడు కొత్తగా ప్రభాస్ పెళ్ళి గురించి వస్తున్న న్యూస్ ఏంటంటే.. వైజాగ్ కు చెందన ఒక ఇండస్ర్టియలిస్ట్ కూతురును చూసి పెట్టారట కొందరు పెద్దలు. వారు కూడా రాజుల క్యాస్ట్ కు చెందినవారేనని.. ఆ అమ్మాయితో ప్రభాస్ పెళ్ళి మొత్తంగా కన్ఫామ్ అయ్యిందని అంటున్నారు. గత కొంతకాలంగా ప్రభాస్ అంకుల్ కృష్ణంరాజు వైజాగ్ లోనే ఉండి ఈ విషయాలన్నీ దగ్గరుండి చూసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇందులో నిజంగా ఉన్నా లేకపోయినా.. ఈసారైనా నిజం అవుతుందేమో అన్నట్లు మీడియాలో ఇప్పుడు ఈ వైజాగ్ గాళ్ రూమర్ చెక్కర్లు కొడుతోంది.

అయితే ప్రభాస్ మాత్రం బాహుబలి షూటింగులో బిజీగా ఉన్నాడు. పైగా ఎల్లుండ ముంబయ్ లో బాహుబలి 2 ప్రెస్ మీట్ ఉంది కాబట్టి.. దాని కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అది సంగతి.

,  ,  ,  ,  ,