చాన్నాళ్ల తరువాత బాబు బంగారం సినిమాతో హిట్ అందుకున్న సీనియర్ హీరో ?విక్టరీ వెంకటేష్? బాలీవుడు సినిమా సాలా ఖదూస్ ని తెలుగులోకి రీమేక్ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు. ఇకపోతే తెలుగులో ?గురు? అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19 నుండి మొదలవుతుంది.
ఈ చిత్ర షూటింగ్ మొదట వైజాగ్, ఆ తరువాత చెన్నై, ఊటీల్లో నిర్విరామంగా జరగనుంది. ఈ చిత్రంలో బాక్సింగ్ కోచ్ గా కనిపించనున్న వెంకీ ఆ పాత్రలో పర్ఫెక్షన్ కోసం బాడీ బిల్డింగ్, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా హిందీ, తమిళ్ వెర్షన్లలో నటించిన రితికా సింగ్ఫిమేల్ లీడ్ గా నటించనుంది. ఇకపోతే సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.