Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2016 10:46:21
facebook Twitter Googleplus
Photo

పెద్ద నోట్ల రద్దు ప్రభావం సినీ పరిశ్రమ మీద బాగానే పడింది. ఈ నిర్ణయం వెలువడిన మరుసటి రోజు మార్నింగ్ షో నుంచే దేశవ్యాప్తంగా కలెక్షన్లు పడిపోయాయి. థియేటర్లు వెలవెలబోయాయి. ముఖ్యంగా లాస్ట్ వీకెండ్లో వచ్చిన కొత్త సినిమాలపై ప్రభావం బాగా పడింది. అక్కినేని నాగచైతన్య సినిమా ?సాహసం శ్వాసగా సాగిపో? కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి పెద్ద నోట్ల రద్దే ప్రధాన కారణం. ?ప్రేమమ్? లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన చైతూ సినిమాకు ఇలాంటి కలెక్షన్లు రావడం ఆశ్చర్యం కలిగించేదే. ఐతే ఓవరాల్ గా ?సాహసం..? కలెక్షన్లు దెబ్బ తిన్నాయి కానీ.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నైజాం ఏరియాలో మాత్రం ఈ చిత్రం మంచి వసూళ్లే సాధించింది.

తొలి రోజు నైజాంలో రూ.75 లక్షల షేర్ రాబట్టి ?సాహసం..? మూడు రోజుల ఫస్ట్ వీకెండ్లో రూ.2 కోట్ల షేర్ తెచ్చుకుంది. గ్రాస్ రూ.3.4 కోట్లు ఉండటం విశేషం. ఐతే ఆంధ్రప్రదేశ్ లోని ఏరియాలన్నీ కలిపితే ఈ సినిమాకు వచ్చింది రూ.2 కోట్ల షేరే కావడం గమనార్హం. మామూలుగా అయితే నైజాం కలెక్షన్ల మీద 50 శాతమైనా ఎక్కువ రావాలి. ఏపీలోని అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్లపై ప్రభావం పడింది. నైజాం కలెక్షన్లు ప్రధానంగా హైదరాబాద్ సిటీ మీద ఆధారపడి ఉంటాయి. ఐతే ఇక్కడ దాదాపుగా అన్ని థియేటర్లకూ ఆన్ లైన్ బుకింగ్ ఉంది. దీంతో జనాలు టికెట్లు ఆన్ లైన్లో బుక్ చేసుకుని థియేటర్లకు వెళ్లారు. దీంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి. మరోవైపు అమెరికాలో సైతం ఈ చిత్రం బాగానే వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ వీకెండ్లో అక్కడ రూ.1.6 కోట్ల గ్రాస్.. రూ.64 లక్షల షేర్ వచ్చింది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్లో ?సాహసం..? రూ.5.43 కోట్ల షేర్.. రూ.10.4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

,  ,  ,  ,