Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Oct-2016 12:07:57
facebook Twitter Googleplus
Photo

ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనుకున్న సినిమా ఎట్టకేలకు విడుదలయ్యేలా కనిపిస్తోంది. గౌతమ్ మీనన్-అక్కినేని నాగచైతన్యల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ?సాహసం శ్వాసగా సాగిపో? నవంబర్లో పక్కాగా రిలీజయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి గత కొన్ని నెలల్లో ఎన్నెన్నో ఊహాగానాలు వచ్చినా స్పందించని గౌతమ్.. తాజాగా రిలీజ్ డేట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈ చిత్ర తమిళ వెర్షన్ విషయంలో ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లు గౌతమ్ వెల్లడించాడు. తెలుగు వెర్షన్ ట్రైలర్ మూడు నెలల ముందే రిలీజవ్వగా.. తమిళ ట్రైలర్ ఇప్పుడే లాంచ్ చేయడం విశేషం. ఆదివారమే ట్రైలర్ రిలీజ్ చేశాడు గౌతమ్.

ఈ సందర్భంగా గౌతమ్ మీనన్ ట్విట్టర్లో.. ??అచ్చం ఎన్బదు మదమాయద ఫైనల్ లెగ్ ప్రమోషన్లు ఈ ట్రైలర్ తోనే మొదలవుతున్నాయి. రిలీజ్ డేట్ కనుచూపు మేరలో కనిపిస్తోంది. త్వరలోనే ఇక్కడే వెల్లడిస్తా?? అని పేర్కొన్నాడు. కాబట్టి నవంబర్లో ఈ సినిమా పక్కా అనుకోవచ్చు. చైతూ ఇటీవలే ?ప్రేమమ్?తో సక్సెస్ కొట్టిన నేపథ్యంలో ?సాహసం శ్వాసగా సాగిపో?కు అది కలిసొచ్చే విషయమే. ఏడాది కిందటే వస్తుందనుకున్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నప్పటికీ చైతూ-గౌతమ్ కాంబినేషన్ మీద ఉన్న భరోసాతో అంచనాలకేమీ లోటు ఉండకపోవచ్చు. ఈ సినిమా తమిళ వెర్షన్లో శింబు కథానాయకుడిగా నటించగా.. రెండు భాషల్లోనూ మాంజిమా మోహన్ కథానాయికగా చేసింది.

,  ,  ,  ,