Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2016 12:21:27
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య అవార్డ్స్ అనేవి రికమెండేషన్ జాబ్స్ మాదిరి అయిపోయాయి..టాలెంట్ ను గుర్తించడం మరచిపోయి వారి వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ చూసి ఇవ్వడం ఎక్కువయ్యింది..దీంతో అభిమానులు కావాలనే తమ హీరోని తొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ చూస్తే ఇట్టే అర్థం అవుతుంది..

2015లో విడుదలైన ?బాహుబలి? చిత్రం.. 2015, 16 సంవత్సరాల్లో జరిగిన అన్ని రకాల అవార్డుల ఫంక్షన్లో అనేక క్యాటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఇలా అనేక క్యాటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది.కానీ బెస్ట్ యాక్టర్ కింద మాత్రం ప్రభాస్ ఒక్క అవార్డు కూడా దక్కలేదు..దీనికి కారణం అతడి టాలెంట్ కాదు అతడి ప్రవర్తన అని కొంతమంది అంటున్నారు..

అది ఎలా అంటే ప్రభాస్ పెద్దగా ఎటువంటి అవార్డుల కార్యక్రమానికి హాజరుకాడు. అలాగే మీడియా కూడా దూరంగా ఉంటాడు..అందుకే ఆయనకు ఏ అవార్డు రావడం లేదని అంటున్నారు. దీంతో ఇతడి అవార్డ్స్ అన్ని పక్క హీరోలు తన్నుకపోతున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..ఇక నుండి అయిన ప్రభాస్ అతడి సినిమాలకే కాకుండా బయట ఫంక్షన్ లలో కూడా కనిపిస్తే బాగుంటుందని అంటున్నారు.

,  ,  ,  ,  ,