Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2017 10:18:21
facebook Twitter Googleplus
Photo

తమిళనాట అజిత్.. విజయ్ అభిమానుల మధ్య పోటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్ల నుంచి వీళ్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని యుద్ధాలు చేసుకుంటున్నారు. తమ హీరో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజైనప్పటి నుంచి మొదలవుతుంది అభిమానుల హంగామా. యూట్యూబ్ లో వ్యూస్.. లైకుల దగ్గర తమ హీరోనే గొప్ప అని రుజువు చేయడానికి కాచుకుని కూర్చుని ఉంటారు. ఇన్ని గంటల్లో ఇన్ని వ్యూస్ అని.. ఇన్ని లైకులొచ్చాయని తెగ హడావుడి చేస్తుంటారు. అజిత్.. విజయ్.. ఇద్దరిలో ఎవరి సినిమాకు సంబంధించిన విశేషం బయటికి వచ్చినా యూట్యూబ్ లో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి. వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు అభిమానులు.

అజిత్ సినిమా వేదాలం రిలీజ్ తర్వాత విజయ్ సినిమాలు రెండు వచ్చాయి. అప్పుడు విజయ్ అభిమానులు వ్యూస్.. లైకుల విషయంలో రికార్డుల మోత మోగించారు. ఇప్పుడు అజిత్ అభిమానుల వంతు వచ్చింది. నిన్న అర్ధరాత్రి రిలీజైన వివేగం టీజర్ కు హిట్స్.. లైక్స్ కొట్టే పనిలో వాళ్లు బిజీగా ఉన్నారు. కేవలం 17 గంటల్లోనే ఈ టీజర్ 5 మిలియన్ వ్యూస్ దాటేయడం విశేషం. లైక్స్ 3 లక్షలకు దగ్గరగా ఉన్నాయి. బాహుబలి ని పక్కన పెట్టేస్తే సౌత్ ఇండియాలో ఏ టీజర్ కూడా ఇంత వేగంగా 5 మిలియన్ మార్కును అందుకోలేదు. యూట్యూబ్ వ్యూస్ కాకుండా.. మొత్తం కలిపితే 12 గంటల్లోపే వివేగం టీజర్ 5 మిలియన్ మార్కును అందుకుందట. రెండో రోజుకే ఈ టీజర్ కోటి వ్యూస్ కూడా పూర్తి చేసుకునేలా ఉంది.

,  ,  ,  ,  ,