Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Nov-2015 18:00:10
facebook Twitter Googleplus
Photo

గౌతమ్ మీనన్ స్పెషాలిటీ అదే మరి. ఒక్క షాట్ చూసినా చాలు ఇన్ స్టంట్ గా ఎక్కేస్తుందంతే. ఇప్పటికే ?సాహసం శ్వాసగా సాగిపో? తొలి టీజర్ లో తనదైన మార్కు చూపించిన మీనన్.. తాజాగా ఇంకో టీజర్ తో సినిమా మీద అంచనాల్ని మరింత పెంచేశాడు. ఈ రోజు నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి.

ఇదిగో హీరో.. మన పక్కింటి కుర్రాడి లాగే ఉంటాడు అంటూ గౌతమ్ మీనన్ సొంత వాయిస్ తో చైతూను పరిచయం చేస్తూ.. ఆ తర్వాత అతడిలోని మరో కోణాన్ని మనకు చూపించాడు. మామూలుగా సాగిపోయే ఓ కుర్రాడి జీవితం ఓ అనూహ్య సంఘటన తర్వాత ఎలా మారిపోయిందన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. టీజర్ మొదట అంతా ప్లెజెంట్ గా కనిపించి.. ఆ తర్వాత యాక్షన్ మోడ్ లోకి వెళ్లింది.

గౌతమ్ ఇంతకుముందు తీసిన రాఘవన్ సినిమాలో విలన్ గా అదరగొట్టిన నటుడు ఇందులోనూ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. బాబా సెహగల్ పోలీసు పాత్రలో కనిపిస్తుండటం విశేషం. చైతూ లుక్ కానీ.. అతడి యాక్టింగ్ కానీ.. టీజర్ లోనే చాలా బాగా అనిపిస్తున్నాయి. కొత్తమ్మాయి మాంజిమా మోహన్ హీరోయిన్ పాత్రకు యాప్ట్ గా కనిపిస్తోంది. మొత్తానికి చైతూకి బర్త్ డే విష్ చెబుతూ గౌతమ్ రిలీజ్ చేసిన ?సాహసం శ్వాసగా సాగిపో? టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే పెంచేలా ఉంది.

,  ,  ,  ,