Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2016 15:07:31
facebook Twitter Googleplus
Photo

మన దేశంలో హాలీవుడ్ సినిమాలు ఇరగదీసేసి ఆడ్డం పెద్ద విషయం కాదు. గతంలో చాలానే సినిమాలున్నా రీసెంట్ టైంలో అయితే అవతార్ ట్రాన్స్ ఫార్మర్స్ 4 తర్వాత.. మళ్లీ ఆ రేంజ్ లో ఆడిన సినిమా లేదు. ఇండియన్ స్క్రీన్ పై హాలీవుడ్ సినిమాల సత్తా తగ్గిపోయిందా అనుకుంటున్న టైంలో.. కరెక్ట్ గా వచ్చింది జంగిల్ బుక్. మోగ్లీ మన దేశంలో సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. అవతార్ ని మించి వసూళ్లు సాధించేస్తున్నాడు.

ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై అతి ఎక్కువ వసూళ్లు సాధించి జంగిల్ బుక్ రికార్డ్ సృష్టించగా.. ఇప్పుడు ప్రతీ రోజూ తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతుండడం విశేషం. ఇప్పటికి మన దేశంలోనే జంగిల్ బుక్ వసూలు చేసిన మొత్తం ఎంతో తెలుసా.. 164 కోట్లు. షారూక్ ఖాన్ లాంటి నేషనల్ వైడ్ స్టార్ హీరో కూడా ఈ స్థాయి వసూళ్లు సాధించలేకపోతున్న తరుణంలో.. మోగ్లీగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నీల్ సేథి ఈ రికార్డ్ సాధించడం విశేషం.

రియలిస్టిక్ గా ఉన్న విజువల్స్ మనోళ్లను బాగా ఆకట్టుకున్నాయి. అడవిలో మోగ్లీ సాహసాలకు ఇండియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. పైగా ఇది కంప్లీట్ హాలిడే సీజన్ కావడం.. జంగిల్ బుక్ కి బాగా కలిసొచ్చింది. కనీసం 175-180 కోట్ల రూపాయలను ఇండియన్ మార్కెట్ నుంచే వసూలు చేయడం ఖాయమంటున్నారు.

,  ,  ,  ,  ,