Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Apr-2017 11:18:37
facebook Twitter Googleplus
Photo

సాహో అంటూ ప్రభాస్ కొత్త సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ బాహుబలి 2 రిలీజైన కొన్న నెలల తరువాత అంటే ఎక్కడ క్రేజ్ తగ్గిపోతుందేమో అని ఆలోచించి.. బాహుబలి 2 సినిమాతో పాటే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమా టీజర్ ను 28న ధియేటర్లలో చూపిద్దాం అనుకుంటే.. ఇది ముందుగానే రిలీజ్ అయిపోయింది.

కారణాలు తెలియదు కాని.. సడన్ గా యుట్యూబ్ లో సాహో టీజర్ దర్శనమిచ్చింది. ఈ టీజర్లో ప్రభాస్ ముఖం మీద రక్తం కనిపించే షాట్ కాస్త వయలెంట్ గా ఉందని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. అలాగే ఆ రక్తం అంతా ప్రభాస్ ది అనుకుని విలన్ నవ్వుకుంటుంటే.. అది వాడిది కాదు సార్ మన కుర్రాళ్ళది అంటూ వేరే వాయిస్ చెబుతుందట. అలా కొన్ని మసాలా హీరోయిజం షాట్లతో ఈ టీజర్ ను రూపొందించారట. అయితే ఈ టీజర్ ను ఎక్కువమంది చూసేలోపే రంగంలోకి దిగిన యువి క్రియేషన్స్ వారు.. దాదాపు అన్ని యుట్యూబ్ ఛానళ్లనుండీ వీడియోను డెలీట్ చేయించేశారు.

రన్ రాజా రన్ ఫేం సుజిత్ డైరక్షన్లో ఇప్పుడు ''సాహో'' సినిమా రూపొందుతోంది.

,  ,  ,  ,  ,