Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2016 11:20:54
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన ఫ్యాన్ మూవీ ఏప్రిల్ 15న గ్రాండ్ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. స్టార్ హీరో ఆ హీరోకి ఫ్యాన్ గా తనే నటిస్తూ విభిన్నమైన స్టోరీ కాన్సెప్ట్ తో తెరపైకి వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ జైహో అంటున్నారు. తొలిరోజు కలెక్షన్ రికార్డుల విషయంలో 2016లో హైయెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది ఫ్యాన్.

రిలీజ్ రోజున ఈ చిత్రానికి దేశంలో 19.2 కోట్ల నెట్ 26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటివరకూ ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనర్లుగా అక్షయ్ కుమార్ మూవీ ఎయిర్ లిఫ్ట్ కి 12.35 కోట్లు ది జంగిల్ బుక్ కి 10.09 కోట్లు రాగా.. ఇప్పుడా రికార్డును దాటేసింది ఫ్యాన్. ఇక ఓవర్సీస్ లోనూ ఫ్యాన్ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ డాలర్లను తొలి రోజునే వసూలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. యూఎస్ఏ బాక్సాఫీస్ నుంచి 5.5 లక్షల డాలర్లు రాగా.. గల్ఫ్ నుంచి 1.4 మిలియన్ల వసూళ్లు దక్కాయి. పాకిస్తాన్ - ఇంగ్లండ్ ల నుంచి 1.8లక్షల డాలర్లు 1.55 లక్షల డాలర్లు రాబట్టాడు ప్యాన్. మిగిలిన దేశాల నుంచి 8 లక్షల డాలర్లు వచ్చాయి.

అయితే.. ఈ మూవీలో లవ్ స్టోరీ లేకపోవడం.. సాంగ్స్ విషయంలో మెప్పించలేకపోవడం డిజప్పాయింట్ గా చెబుతున్నారు ట్రేడ్ పండిట్స్. ఆ ఎలిమెంట్స్ మిక్స్ అయితే..ఫ్యాన్ కి ఇంకా కలెక్షన్స్ ఎక్కువగా వచ్చేవన్నది ఇండస్ట్రీ టాక్.

,  ,  ,  ,  ,  ,  ,