Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2017 10:43:38
facebook Twitter Googleplus
Photo

రాజమౌళి రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ తో కలిసి ఫొటోకి స్టీల్ ఇచ్చాడో అప్పటి నుంచి రూమర్స్ కి మంచి ఫుల్ బాటిల్ దొరికానట్టు అయ్యింది. అసలే కోతి ఆపై కళ్లు తాగింది అనే వర్డ్ అందరికి తెలిసిందే. అయితే అదే తరహాలో నార్మల్ గా ఫొటోస్ దిగితేనే సినిమా చేస్తున్నారని రూమర్స్ చక్కర్లు కొడతాయి. పైగా జక్కన్న ట్వీట్ లో కేవలం డాట్స్ పెట్టి కన్ను కొట్టే ఎమోజి పెట్టడంతో రూమర్స్ కి కిక్కు ఎక్కేసింది.

మొత్తానికి కాంబినేషన్ అయితే సెట్ అయ్యింది. దీంతో అఫీషియల్ గా క్లారిటీ రాకపోవడంతో రూమర్స్ కి కిక్కు ఏ మాత్రం తగ్గలేదు. ఇష్టం వచ్చినట్టు ఎవరూ ఊహించని విధంగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడని కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ మెగా అల్లుడు రూమర్స్ కిక్కును ఒక్క కామెంట్ తో దించేశాడు. అసలు ఆ మల్టీస్టారర్ సినిమాలో తన పాత్ర అస్సలు లేదని చెప్పాడు.

అంతే కాకుండా గ్యాంగ్ లిడర్ రీమేక్ లో నటిస్తున్నాను అని ఇంకా చాలా రూమర్స్ వస్తున్నాయని అందులో ఎంత మాత్రం నిజం లేదని తెలుపుతూ.. ఆ సినిమాను చేస్తే రామ్ చరణే చెయ్యాలని మరోసారి క్లారిటీ ఇచ్చాడు.

,  ,  ,  ,  ,