Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jun-2016 11:56:01
facebook Twitter Googleplus
Photo

ఒట్టేసి చెబుతున్నా సినిమాలో రెడ్డినాయుడుగా ఎమ్మెస్ నారాయణ పండించిన కామెడీని అంత సులువుగా మరిచిపోలేం. ముఖ్యంగా ఫ్యాక్షనిస్టు పాత్రలో వీరావేశంతో డైలాగ్ చెబుతూ తొడగొట్టే సీన్ ఒకటుంటుంది. ఎమ్మెస్ అలా తొడకొట్టగానే అతడి పంచె ఊడిపోతుంది ఆ సీన్లో. అది చూసి నవ్వని ప్రేక్షకుడుండడు. ఐతే మన యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందట ?సుప్రీమ్? షూటింగ్ సందర్భంగా సీరియస్ గా ఓ డైలాగ్ చెబుతుంటే పంచె ఊడిపోయిందని.. ఆ సంగతి తనకు కొంతసేపటి వరకు తెలియదని చెప్పాడు సాయిధరమ్.

??సుప్రీమ్ సినిమాలో పిల్లనడగడానికి నేను పంచె కట్టుకుని రాశీ వాళ్ల ఇంటికి వెళతాను. ఆ సీన్ తీసేటప్పుడు నేను జోరుగా డైలాగ్ లు చెబుతూ.. అన్నీ మర్చిపోయి యాక్ట్ చేస్తున్నా. ఇంతలో కాళ్లకు చల్లగాలి తగిలినట్లనిపించినా పట్టించుకోలేదు. అందరూ నన్నే చూసి నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు కింద చూసుకుంటే పంచె లేదు. ఎప్పుడు జారిపోయిందో తెలియదు?? అని సాయిధరమ్ చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఇంకా ఎన్నో సరదా సంఘటనలు జరిగాయని.. ఓసారి కరీం నగర్లో షూటింగ్ చేస్తున్నపుడు యూనిట్లో అందరం కలిసి ?రాశీ కా స్వయంవర్? పేరుతో హీరోయిన్ రాశి ఖన్నా కోసంఓ గేమ్ ప్లాన్ చేశామని.. అందులో వెన్నెల కిషోర్ విజేతగా నిలిచాడని సాయిధరమ్ చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,  ,