Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Feb-2015 10:47:15
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ నటించే 'గబ్బర్ సింగ్ 2' చిత్రం షూటింగుకు షెడ్యూల్స్ ఫైనల్ చేస్తున్నారు. వచ్చే నెల 20 నుంచి ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ప్రస్తుతం జోరుగా నడుస్తున్నాయి. గతంలో పవన్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం సూపర్ హిట్టయిన విషయం మనకు తెలిసిందే. అందుకే, 'గబ్బర్ సింగ్ 2' పేరిట మరో చిత్రాన్ని నిర్మించడానికి ఉపక్రమించారు. అయితే, దానికిది సీక్వెల్ ఎంత మాత్రం కాదని చిత్ర నిర్మాత శరత్ మరార్ చెబుతున్నారు. 'పవర్' ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశాఖ అమ్మాయి అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటిస్తోంది. మరో కథానాయికగా బాలీవుడ్ తారను ఎంపిక చేస్తున్నారు.

,  ,  ,  ,  ,