Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Sep-2015 16:07:57
facebook Twitter Googleplus
Photo

ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో చిరంజీవిని వాడుకునేవాడు. అన్నయ్య ప్రస్తావన తీసుకొచ్చి మెగా అభిమానుల్ని అలరించేవాడు. ఐతే చిరంజీవి నెమ్మదిగా సినిమాల నుంచి సైడైపోవడంతో యంగ్ హీరోస్ అందరూ పవన్ ను వాడుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నితిన్ లాంటి హీరోలు పవన్ ని ఫుల్లుగా వాడేశారు. ఐతే నితిన్ మిగతా హీరోలు పవన్ ని ఎంతైనా వాడి ఉండొచ్చు కానీ.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వాడకం ముందు మిగతా వాళ్ల వాడకం దిగదుడుపే.

తన కొత్త సినిమా ?సుబ్రమణ్యం ఫర్ సేల్?లో చిన్న మావయ్య పవన్ కళ్యాణ్ ని పెద్ద మావయ్య చిరంజీవిని ఓ రేంజిలో వాడేశాడు సాయిధరమ్. మావయ్యల పోలికల్ని బాగా పుణికి పుచ్చుకున్న ఈ మెగా మేనల్లుడు.. వాళ్ల బాడీ లాంగ్వేజ్ ని వాళ్ల మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ అభిమానుల్ని ఉర్రూతలూగించాడు. సాయి ఇంట్రడక్షనే మెగా అభిమానులకు కన్నుల పండగ. తమ్ముడులో పవన్ కళ్యాణ్ స్టెప్పులతో ఎంట్రీ ఇస్తాడు సాయి. ఆ తర్వాత ఫస్ట్ సాంగ్ లో ?ముఠామేస్త్రి?లో చిరు లుంగీ స్టెప్పుతో అదరగొట్టాడు.

ఆ తర్వాత సినిమా అంతటా కూడా మేనమామల్ని గుర్తుకు తెస్తూనే సాగాడు సాయిధరమ్. అతను నడుస్తున్నపుడు డైలాగులు చెబుతున్నపుడు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నపుడు.. ఇలా ప్రతి సన్నివేశంలోనూ చిరంజీవి - పవన్.. ఇద్దరిలో ఎవరో ఒకరు తనలో కనిపించేలా చేశాడు సాయిధరమ్. మొత్తానికి ఆద్యంతం మావయ్యల్ని గుర్తుకుతెస్తూ అభిమానుల్ని ఉర్రూతలూగించాడు మెగా మేనల్లుడు. ?సుబ్రమణ్యం ఫర్ సేల్? తర్వాత మెగా అభిమానులందరూ సాయిధరమ్ ను బాగా ఓన్ చేసుకుంటారనడంలో సందేహం లేదు.

,  ,  ,  ,