Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Mar-2017 15:21:36
facebook Twitter Googleplus
Photo

నేను శైలజ సినిమాతో రామ్ కి హిట్టిచ్చాడు యువ దర్శకుడు కిషోర్ తిరుమల. తొలి ప్రయత్నంగా తీసిన ఆ సినిమాతో తానూ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. దాంతో పలువురు అగ్ర కథానాయకులతో సినిమాలు చేసే అవకాశం ఆయన్ని వరించింది. వెంకటేష్ కి `ఆడాళ్లూ మీకు జోహార్లు` కథ చెప్పి ఓకే చేయించాడు కూడా. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా ఆగిపోయింది. అందుకే ఈసారి మళ్లీ తన తొలి సినిమా హీరోతోనే జట్టుకట్టాడు కిషోర్. నేను శైలజ తరహాలోనే ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు సర్వం సన్నద్ధం చేసుకొన్నాడు.

అయితే ఈసారి తెరకెక్కే సినిమాలో మాత్రం ఇద్దరు శైలజలు ఉన్నారు. అంటే రామ్ ఇద్దరు భామలతో ఆడిపాడబోతున్నారన్నమాట. ఆ ఇద్దరిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగా - మరొకరు మేఘా ఆకాష్. ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కానున్న ఈ సినిమాని నేను శైలజ చిత్రాన్ని నిర్మించిన స్రవంతి రవికిషోరే నిర్మాత. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సీతారామశాస్త్రి - ఎ.ఎస్.ప్రకాష్ - శ్రీకర్ ప్రసాద్ - సమీర్ రెడ్డి తదితర టాప్ టెక్నీషియన్లు సినిమాకి పనిచేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా భారీ సెటప్పుతోనే రంగంలోకి దిగుతున్న కిషోర్ తిరుమల మరోసారి హిట్టు కొట్టి తీరాలన్న కసితో కనిపిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలో రామ్ బాడీలాంగ్వేజ్ లుక్ కొత్తగా ఉండబోతోందట.

,  ,  ,  ,  ,