Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2016 11:49:14
facebook Twitter Googleplus
Photo

ఒక హీరోయిన్ని తొలి సినిమాలో చూడగానే ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఆ తర్వాత ప్రేక్షకులు ఆ రకమైన కోణంలోనే ఆ హీరోయిన్ని చూస్తారు. సౌందర్య.. నిత్యా మీనన్ లాంటి హీరోయిన్లను చూడగానే ట్రెడిషనల్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. వాళ్లను పద్ధతిగా చూడ్డానికే ప్రేక్షకులు ఇష్టపడతారు. ఎక్స్ పోజింగ్ ఆశించరు. మలయాళ కుట్టి సాయిపల్లవి కూడా ఈ కోవకే చెందుతుంది. ?ప్రేమమ్? సినిమాలో ఆమె ఎంత ట్రెడిషనల్ గా కనిపించిందో.. ఎలాంటి ముద్ర వేసిందో తెలిసిందే. ఆమె నుంచి ఎవ్వరూ కూడా అందాల ప్రదర్శన ఆశించరు.

ఐతే తాజాగా సాయిపల్లవి గురించి ఒక చిత్రమైన రూమర్ వచ్చింది. ఆమెను ఓ తమిళ సినిమా కోసం అడిగారని.. ఐతే ఎక్స్ పోజింగ్ చేయాలని అడిగితే నో అనడంతో ఆమెకు ఛాన్సివ్వలేదని.. ఇలాగే ఇంకా ఒకట్రెండు అవకాశాలు చేజార్చుకోవాల్సి వచ్చిందన్నది ఈ రూమర్ సారాంశం. ఐతే ఈ రూమర్లను సాయిపల్లవి ఖండించింది. ఆమె ఖండించడం సంగతలా ఉంచుదాం. సాయిపల్లవి లాంటి హీరోయిన్ నుంచి ఎవరైనా అసలు అందాల ప్రదర్శన ఆశిస్తారా? ఆమె ఫీచర్స్ ఆ రకంగా ఉంటాయా? ఇప్పటిదాకా ఆమె ఏ సినిమాలో అయినా అలా కనిపించిందా? తనలాంటి హీరోయిన్ నుంచి మంచి నటన మాత్రమే ఆశిస్తారు ప్రేక్షకులు. దర్శక నిర్మాతలు కూడా ఆమెకు అలాంటి పాత్రలే ఆఫర్ చేస్తారు. శేఖర్ కమ్ముల కూడా ?ఫిదా?లో అలాగే అవకాశమిచ్చాడు. మరి ఆ సినిమాలో ఆమె ఎలా కనిపిస్తుందో చూద్దాం.

,  ,  ,  ,