Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2015 11:41:04
facebook Twitter Googleplus
Photo

ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నారని న్యూస్ వచ్చినప్పుడు.. వారు వేసే ఏ చిన్నట్వీట్ అయినా కూడా వారి గురించి ప్రపంచానికి మరో కోణంలో పరిచయం చేస్తుంది. చూడండి.. ఇలియానా ఎప్పుడు ప్రేమ గురించి ఏ ట్వీట్ వేసినా కూడా.. అది ఖచ్చితంగా తన ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ గురించే అని అందరూ అనుకుంటాం. అందులో నిజమున్నా లేకపోయినా కూడా.. ఆలోచన సరళి మాత్రం అలాగే ఉంటుంది.

ఇప్పుడు 49 ఏళ్ళ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పరిస్థతి కూడా ఇంతే. మనోడు రొమానియన్ మోడల్ లూలియా వాంటూర్ తో క్లోజ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ వీళ్లిద్దరూ ఎక్కడో చోట మీడియా కెమెరాల కళ్లకు చిక్కుతూనే ఉన్నారు. అందుకే ఇద్దరూ లవ్ లో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది మరి. అయితే ఇప్పుడు తాజాగా ఓ రమూర్ బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. కండలవీరుడు తన బ్యాచ్ లర్ జీవితానికి స్వస్తి చెప్పేసి.. త్వరలోనే తన గాళ్ ఫ్రెండును వివాహమాడతాడని మరోసారి రూమర్లు విచ్చుకున్నాయి. 'లా.. లా.. లా.. సచ్ ఏ బ్యూటీఫుల్ లైఫ్.. హృదయంలోని ఎన్నో అందమైన ఊసులను పంచుకోబోతున్నాం' అంటూ లులియా ట్విట్టర్ లో చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ ఇలా వేసిందో లేదో.. వెంటనే మీడియా ఏం అర్ధం చేసుకుందంటే.. బాహుశా సల్మాన్ ఈమెను పెళ్ళాడేస్తున్నాడేమో... అనే సందేహం పుట్టించేశౄరు. ఇంతకీ మనోడు నిజంగానే పెల్ళికొడుకు అయ్యాడా?

ఈ వార్తలు నిజం కాదని లులియతో తన అన్న సల్మాన్ కు నిశ్చితార్థం అయిందని వచ్చిన వార్తలు పుకార్లేనని చిట్టి చెల్లెలు అర్పితాఖాన్ చెప్పడం కొసమెరుపు.

,  ,  ,