Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2017 12:39:52
facebook Twitter Googleplus
Photo

చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్దవిగా మారుతుంటాయి.తాజాగా చూస్తే.. అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. సంక్రాంతి పండక్కి నాలుగు సినిమాలు విడుదల అవుతున్నా.. అందరి నోట నానున్నది మాత్రం బాలయ్య శాతకర్ణి.. చిరు ఖైదీ చిత్రాలే. ఈ రెండు సినిమాలు బాలయ్య.. చిరులకు మైల్ స్టోన్ లాంటివి కావటం.. ఈ సినిమా విజయం తమ కెరీర్ కు ఒక మైలురాయిలా మారాలని తపిస్తున్నారు.

వారే కాదు.. వారి అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించిన ఒక కీలక అంశాన్ని తన ట్వీట్ తో బయటకు తీసుకొచ్చారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. తాజాగా ఆయన చేసిన ట్వీట్ శాతకర్ణి మీద అంచనాల్నిభారీగా పెంచేయటమే కాదు.. ఈ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసేలా మారిందన్న మాట వినిపిస్తోంది.

ముంబయిలోని ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ శాతకర్ణి చిత్రాన్ని చూసిందని.. జాతీయ.. అంతర్జాతీయ హక్కులు కొంటోందని తన ట్వీట్ ద్వారా బయటపెట్టారు వర్మ. ముంబయిలో వేసిన సింగిల్ షో తర్వాత.. క్రిష్ నాలుగు కంపెనీలకు సంతకాలు చేశారని.. అందులో ఒకటి ఏకే అని.. రెండోది ఎస్ కే అని విన్నట్లుగా చెప్పారు.

మిగిలిన రెండు సంస్థల గురించి వివరాలు వెల్లడించని వర్మ.. తాను చెప్పిన రెండు కంపెనీల సంతకాల ముచ్చటను అధికారికంగా కన్ఫర్మ్ చేయమని కోరారు. మరి.. వర్మ ట్వీట్లకు క్రిష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏమైనా.. శాతకర్ణి సినిమాపై బాలయ్య అభిమానులు మరింత గొప్పగా చెప్పుకోవటానికి వీలుగా వర్మ ట్వీట్లు ఉన్నాయని చెప్పక తప్పదు.

,  ,  ,  ,  ,  ,