ఇమేజ్-క్రేజ్ విషయంలో హీరోల మధ్య పోటీ పైకి కనిపిస్తూనే ఉంటుంది. హీరోయిన్స్ మధ్య కూడా డామినేషన్ విషయంలో పోటీ ఉంటుంది కానీ.. దాన్ని పైకి ప్రదర్శించే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఒక్కోసారి ఫీలింగ్స్ ని దాచుకోలేక అసలు విషయాన్ని ఇన్ డైరెక్టుగా చెప్పేస్తూ ఉంటారు హీరోయిన్స్. కొందరు మాత్రమే బిహేవియర్ తో ఆకట్టుకోగలుగుతారు.
బ్రహ్మోత్సవం మూవీ ఆడియో రిలీజ్ కి ముందే రెండు సాంగ్ ప్రోమోలను ట్వీట్ చేసింది కాజల్ అగర్వాల్. మిగిలిన పాటలను కూడా ట్వీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ తను కనిపించిన రెండు గ్రూప్ సాంగ్స్ ను మాత్రమే ట్వీట్ చేసి ఆపేసింది కాజల్. కానీ ఇదే సమయంలో సమంత మాత్రం తన గోల్డెన్ బిహేవియర్ తో ఆకట్టుకుంది. స్టేజ్ పై మాట్లాడే సమయంలో హీరో మహేష్ తర్వాత.. ఇద్దరు అందమైన అమ్మాయిలున్నారు. కాజల్ - ప్రణీతలకు ఆల్ ది బెస్ట్ అని.. మనస్ఫూర్తిగా - నిస్సంకోచంగా చెప్పేసింది శామ్స్.
కాజల్ మాత్రం సమంత కనిపించే సాంగ్ ని ట్వీట్ కూడా చేయలేకపోయింది. నిజానికి బృందావనం రిలీజ్ టైంకి కాజల్ పెద్ద హీరోయిన్ - సమంత చిన్న హీరోయిన్. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. అయితే.. శామ్స్ ఈ రేంజ్ కి చేరడానికి కారణం.. సమంతలో ఉన్న ఈ మంచితనమే అని చెప్పచ్చు. కానీ కాజల్ మాత్రం తన ఫీలింగ్స్ ని దాచుకోలేకపోయిందనే విషయాన్ని ఒప్పుకోవాల్సిందే.