సెలబ్రేటీల గతం ఎప్పుడూ ఇంట్రస్టింగే. రజనీకాంత్.. తొలినాళ్ళలో బస్ కండక్టర్ గా గడిపిన రోజులు గురించి ఇప్పటికీ మహా గొప్పగా చెప్పుకుంటారు. ఆయనోక్కరే కాదు.. ఇలా మంది కెరీర్ తొలినాళ్ళ రోజులు గురించి చదివాం.ఇప్పుడు హీరోయిన్ సమంత కూడా తన ఫ్లాష్ బ్యాక్ ను గుర్తుతెచ్చుకుంది. ఒక వెయ్యిరుపాయిలు కోసం మూడు గంటలు పాటు లైన్ లో నిల్చున్న సంఘటన గురించి చెప్పింది.
?నాకు 14 ఏళ్ల వయసు నుంచే నా అవసరాలకు డబ్బులు సంపాదించుకునేదాన్ని. చిన్న చిన్న పనులు చేసి.పెళ్ళిళ్లు జరిగేటపుడు పన్నీరు జల్లే అమ్మాయిగా కూడా పని చేశా. మూడు గంటలు అలా లైన్ లో నిలబడి పెళ్ళికి వచ్చే వారిపై పన్నీరు జల్లితే.. వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. ఆ వెయ్యి రుపాయిలను ఇప్పటికి ఎప్పటికీ మర్చిపోను. ఇప్పుడుఎంత డబ్బు వున్న ఆ వెయ్యి రూపాయిలు సంపాదించినప్పుడు వచ్చిన కిక్కే వేరు? అంటూ తన గతాన్ని గుర్తుచేసుకుంది సామ్.