Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2017 10:03:33
facebook Twitter Googleplus
Photo

సమంత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. తనతో పాటు వుడ్ బీ నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన అప్ డేట్స్ ను సమంత ఎప్పటికపుడు ట్విటర్ లో షేర్ చేస్తుంటుంది. ఆమె ట్వీట్లను అభిమానులు ఫాలో ఆసక్తిగా ఫాలో అవుతుంటారు. తాజాగా వెన్నెల కిషోర్ చేసిన ట్వీట్ పై సమంత ఫన్నీగా రీట్వీట్ చేసింది. అతడిని ఆట పట్టిస్తూ సరదాగా కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది. కమెడియన్ వెన్నెల కిశోర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో వెన్నెల కిశోర్ తన ఐ బ్రోస్ పైకి లేపి చాలా ఫన్నీగా ఫేస్ పెట్టాడు.

చూడడానికి ఆ ఫొటో చాలా హిలేరియస్ గా ఉంది. దీంతో ఆ ఫొటో సమంతకు తెగ నచ్చేసింది. ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ వెన్నెల కిశోర్ పై సమంత ఫన్నీగా కామెంట్ పెట్టింది. ‘వావ్.. నువ్వు చాలా చాలా అందంగా కనిపిస్తున్నావు.. నువ్వే నీ ఐ బ్రోస్ చేసుకున్నావా?.. నువ్వు లిప్ స్టిక్ కూడా పెట్టుకుంటావా?’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. సమంత ట్వీట్లకు ఆమె అభిమానులు ఫిదా అయిపోయారు. సమంత చాలా అల్లరి పిల్ల అంటూ మరి కొందరు కామెంట్ చేశారు. అసలే ఫన్నీగా ఉన్న వెన్నెల కిశోర్ ఫొటోకు సమంత కామెంట్ చాలా హిలేరియస్ గా ఉందంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వెన్నెల కిశోర్ మట్టి తొక్కుతూ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పెట్టిన ఓ ఫొటో కూడా వైరల్ అయింది.

,  ,  ,  ,  ,