Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2017 10:47:21
facebook Twitter Googleplus
Photo

గత ఏడాది రియో ఒలింపిక్స్ సందర్భంగా తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు పేరు దేశమంతా మార్మోగిపోయింది. గతంలో ఎన్నో ఒలింపిక్స్ చూశాం. మన క్రీడాకారులు పతకం గెలవడాన్ని వీక్షించాం. కానీ సింధు పతకం గెలుస్తున్నపుడు కలిగిన ఉద్వేగం ముందు ఇంకేదీ సాటి రాదు. పతకం ఆశించిన చాలామంది స్టార్ క్రీడాకారులు ఒకరి తర్వాత ఒకరు తీవ్రంగా నిరాశ పరుస్తున్న టైంలో సింధు కాంస్య పతకం ఖాయం చేసి దేశం మొత్తానికి ఊరటనిచ్చింది. ఇక ఆమెకు రజతం ఖాయం చేసిన సెమీ ఫైనల్ మ్యాచ్ ను.. ఆపై ఆమె ఓడిపోయిన ఫైనల్ మ్యాచ్ ను కోట్లాది మంది భారతీయులు తీవ్ర భావోద్వేగంతో చూశారు. సింధుకు బాసటగా నిలిచారు. ఇలా దేశం మొత్తాన్ని ఒక్కటి చేసిన సింధుపై బహుమతుల వర్షం కురిసింది. ఆమె సాధించిన పతకం కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది.

సాధారణ నేపథ్యం నుంచి సింధు ఈ స్థాయికి ఎదిగిన వైనంపై సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. తన మీద రాబోతున్న సినిమా గురించి సింధు కూడా స్పందించింది. ఈ సినిమా కోసం చాన్నాళ్ల నుంచే సన్నాహాలు జరుగుతున్నట్లు ఆమె తెలిపింది. సోనూ సూద్ టీమ్ నా బయోపిక్ నిర్మించడానికి ముందుకు వచ్చింది. గత ఎనిమిది నెలలుగా వాళ్లు నా మీద తీయబోయే సినిమాకు సంబంధించి ఎంతో పరిశోధన చేశారు. నా బయోపిక్ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నా అని సింధు తెలిపింది.

,  ,  ,  ,  ,