Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2016 10:31:08
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత.. మరోసారి తన అందమైన మనసును చాటుకుంది. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు ప్రత్యూష ఆర్గనైజేషన్ పేరుతో ఆమె అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చాందిని అనే మరో పాప కాలి శస్త్ర చికిత్సకు సాయం చేసింది. రెండురోజుల క్రితం నగరంలోని ఓ హాస్పిటల్లో చాందినికి శస్త్ర చికిత్స జరిగింది. సమంత బుధవారం హాస్పిటల్కు వెళ్లి పాపను పరామర్శించింది. సహకారం అందించిన హాస్పిటల్కు, సర్జరీ చేసిన డాక్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

సమంత సాయానికి, ఆమె చేస్తున్న సేవలకు అభిమానులు జేజేలు కొడుతున్నారు. సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారి చిరునవ్వులకు కారణమైన సమంత మరోసారి అందరి మనసు దోచుకుంది. ఇంతకుముందు కూడా ఆమె అనేకమంది చిన్నారులకు తన ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలను సాయం చేసింది.

,  ,  ,  ,  ,  ,