Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jan-2016 17:55:50
facebook Twitter Googleplus
Photo

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో మెటీరియల్ అని చాలామంది దర్శక నిర్మాతల నమ్మకం. అందుకే అతణ్ని హీరోగా పెట్టి సినిమా తీయాలని చాలామంది చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ అతనేమో దాటవేస్తూ వచ్చాడు. ఐతే దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత - సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ కలిసి నీతో సినిమా తీస్తామంటే మాత్రం కాదనలేకపోయాడు దేవి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్ మెంట్ వచ్చి నెల దాటింది. ఈ మధ్యలో దేవి తన తండ్రిని కోల్పోవడంతో ఈ సినిమా విషయంలో కొంత సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు అనుమానాలన్నీ తొలగిపోయాయి. దేవి-సుక్కు-దిల్ రాజు కాంబినేషన్లో సినిమా పక్కా అని సమాచారం అందుతోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంచుకుంటారన్నది ఆసక్తికరం. ఈ వరుసలో ముందు వినిపిస్తున్న పేరు సమంత. ఆమెది లక్కీ హ్యాండ్ అన్న సెంటిమెంటు ఉంది కాబట్టి తననే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇప్పటికే సమంతతో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి బ్యాగ్రౌండ్ లేని హీరోకు కూడా తొలి సినిమాకే హిట్టిచ్చిన హ్యాండ్ సమంతది. నాగచైతన్య - మహేష్ బాబు - ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్.. వీళ్లంతా ఫెయిల్యూర్స్ లో ఉన్నపుడు సమంతతో జత కట్టి హిట్టు కొట్టారు. అలాగే దేవి కూడా సమంత చేయి పట్టుకుని హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తాడేమో చూద్దాం మరి.

,  ,  ,