Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Feb-2017 10:34:41
facebook Twitter Googleplus
Photo

అగ్ర హీరోల పక్కన ఇద్దరు స్టార్ హీరోయిన్లు జతకడితే... ఆ స్క్రీన్ లుక్కే మారిపోతుంది. అభిమానులకు కనువిందే. అయితే ఇలాంటి కాంబినేషన్లు అరుదుగా కుదురుతూ ఉంటాయి. ఎన్నో ఫ్యాక్టర్స్ కలిసిరావాలి. అయితే ఒకసారి ఇలా కాంబినేషన్ కుదరడమే కష్టం అనుకుంటే.. దాన్ని రెండోసారి రిపీట్ చేయడం కష్టం! మూడోసారి అసాధ్యం అనుకుంటాం. కానీ స్టార్ హీరోయిన్స్ కాజల్ - సమంతలు వరుసగా ఇప్పుడు మూడోసారి కలిసి నటిస్తున్నారు.

బృందావనంలో ఎన్టీఆర్ పక్కన తొలిసారిగా సమంత కాజల్ లు కలిసి నటించారు. ఆ తరువాత మహేష్ బాబు చిత్రం బ్రహ్మోత్సవంలో మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ కుదిరింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. అయితే ఈసారి తమిళ తెరపై ఈ ఇద్దరు నటిస్తున్నారు. ఇప్పటికే విజయ్ సరసన తుపాకీ సినిమాలో కాజల్ నటించింది. ఆ సినిమా సూపర్ హిట్. ఇక సమంత అయితే... విజయ్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. కత్తి తెరి చిత్రాల్లో విజయ్ తో సమంత రోమాన్స్ చేసింది.

ఇప్పుడీ ముగ్గురూ కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ తో ఈ ఇద్దరూ విడివిడిగా నటించి హిట్స్ కొట్టారు. ఇప్పుడు కలిసి నటించబోతున్నారు. ఒక తెలుగు విషయానికొస్తే... ఖైదీ నంబర్ 150తో కాజల్ మళ్లీ కమ్ బ్యాక్ అన్నట్టే చెప్పాలి. సమంత పెళ్లికి సిద్ధమౌతున్న తరుణంలో... ఆమె సినిమాలు తగ్గించేందున్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇద్దరి కాంబినేషన్ వీరి కెరీర్ కి ఎలా బూస్ట్ అవుతుందో వేచిచూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,