Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2017 11:30:02
facebook Twitter Googleplus
Photo

రాజుగారి గది సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి కలెక్షన్స్ ని కూడా రాబట్టింది. అయితే ఆ చిత్రం అందించిన విజయంతో దర్శకుడు ఓంకార్ దానికి కొనసాగింపుగా రాజుగారి గది - 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సీక్వెల్ చిత్రాన్ని దర్శకుడు భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తీయబోతున్నాడట. అలాగే స్టార్ హోదా ఉన్న నాగార్జున - సమంత ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండడం ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.

త్వరలో అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టబోతున్న సమంత ఈ సినిమాలో కాబోయే మామగారితో కలిసి పేక్షకులను త్రిల్ చేయడం ఖాయమని అంటున్నారు. రీసెంట్ గా సమంత ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుందట. అలాగే చిత్రానికి సంబందించిన ఓ లుక్ ని కూడా సమంత తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసింది. అలాగే తప్పకుండా ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని సమంత కామెంట్ చేసింది. ఇప్పటికే నాగ్ పుట్టిన రోజు సందర్బంగా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సమంత ఇప్పుడు తన లుక్ ని కూడా చూపిస్తూ.. సినిమాపై ఆసక్తిని రేపింది.

ఈ రాజుగారి గది 2 ను పివిపి సంస్థ నిర్మిస్తోంది.

,  ,  ,  ,  ,  ,