Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2017 10:25:36
facebook Twitter Googleplus
Photo

తెలుగు తెరకు పరిచయమైన భామ నికీషా పటేల్. ఆ చిత్రంతో పాటు ఓం త్రీడీ.. అరకు రోడ్లో లాంటి మరికొన్ని సినిమాల్లో కూడా నటించిన నికీషాకు టాలీవుడ్లో బ్రేకే రాలేదు. ఐతే ఇక్కడ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈ ఇండస్ట్రీ గురించి అంతా తెలిసినట్లు మాట్లాడుతోంది నికీషా. టాలీవుడ్లో తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లుగా చూచాయిగా తెలిపింది నికీషా.

ఇటీవల హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ లైంగిక వేధింపుల బాగోతం బయటపడ్డ సమయంలో తన తండ్రి తనకు ఫోన్ చేశాడని.. టాలీవుడ్లో పరిస్థితి ఏంటని అడిగాడని.. అప్పుడు మౌనమే తన సమాధానం అయిందని ఆమె చెప్పింది. ఇలా అనడం ద్వారా టాలీవుడ్లో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న మాట వాస్తవమే అని చెప్పకనే చెప్పింది నికీషా. కాస్టింగ్ కౌచ్ విషయానికి వస్తే.. హాలీవుడ్.. టాలీవుడ్ అని తేడా ఏమీ లేదని ఆమె అంది.

ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు తనకు గతంలో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని.. ఐతే హీరోయిన్ అయ్యానన్న కారణంతోనే అతను తనను వదిలేశాడని.. పెళ్లికి కూడా నిరాకరించాడని నికీషా చెప్పడం విశేషం.

,  ,  ,  ,