సమంతా ఇప్పుడు కోలీవుడ్ లో స్టయిల్ మార్చింది. అక్కడ తన తొలి సినిమా 'మాస్కోవిన్ కావేరీ' నుంచి నిన్నటి వరకు ప్రతి సినిమాలోను మోడ్రన్ గాళ్ గా కనిపించింది. అందుకోసం రకరకాల మోడ్రన్ కాస్ట్యూమ్స్ ధరించింది. గతేడాది వచ్చిన 'అంజాన్' సినిమాలో అయితే ఏకంగా ఈత దుస్తులు కూడా వేసుకుని ప్రేక్షకులను కవ్వించింది. అలాంటి ఈ ఆల్ట్రా మోడ్రన్ హీరోయిన్ ఇప్పుడు సంప్రదాయ సిద్ధంగా చీర కడుతోంది. ప్రస్తుతం తమిళంలో చేస్తున్న '24', 'VIP 2' సినిమాలలో ఈ చిన్నది తమిళ సంప్రదాయ యువతిగా చీరకట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని, ముక్కుపుడకతో దర్శనమిస్తోంది. మరి, పాటల్లోనైనా మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందో, లేదో!
samantha, news, kollywood, tollywood, newlook,