Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-May-2016 11:20:00
facebook Twitter Googleplus
Photo

ఇంతకీ వరుసగా త్రివిక్రమ్ తో మూడో సినిమా చేస్తున్న సమంత.. అసలు ఈ ''అ..ఆ'' సినిమాలో ఎంత కొత్తగా కనిపించనుంది? ఇప్పుడు అందరిదీ అదే వర్రీ. ఎందుకంటే అమ్మడు ''24'' సినిమాలో అచ్చం తన గత సినిమాల్లో చేసిన యాక్షనే.. అవే రియాక్షన్లే.. ఇచ్చిందని విమర్శలు వచ్చాయి. ఇప్పుడేమో ''అ..ఆ'' సినిమాలో చాలా లెంగ్త్ ఉన్న రోల్ చేస్తోంది. మరి ఏమన్నా స్టయిలు మార్చిందా?

''నిజానికి అ..ఆ సినిమాలో తొలిసారిగా నేను కామెడీ ప్రయత్నించాను. టైమింగ్ బాగానే వచ్చింది. అయితే త్రివిక్రమ్ గారు గత సినిమాల్లో చేసిన యాక్షన్లు.. నేను రెగ్యులర్ గా పెట్టే ఎక్సప్రెషన్లూ ఏవీ పెట్టనివ్వలేదు. ఒకవేళ నేను ఏదన్నా సొంతంగా చేస్తే.. నీ టెంప్లేట్ నుండి రియాక్షన్ నెం.5 ఇచ్చావ్.. ఇది వద్దు.. కొత్తది కావాలి అంటూ కట్ చెప్పేసేవారు'' అంటూ చెప్పుకొచ్చింది సమంత. ''అందుకే ప్రతీసారీ కొత్తగా ఉండే రియాక్షన్లు ఇచ్చాను. అ..ఆ మొత్తంలో నేను చాలా కొత్తగా కనిపిస్తున్నా. ఈ సినిమాతో నిజంగానే మరోసారి అ..ఆ లు దిద్దుకున్నట్లు'' అంటోంది కూడా.

అందుకే ఈ సినిమాపై అమ్మడి కాన్ఫిడెన్స్ చాలా పీక్స్ లో ఉంది. ఈ సినిమాతో కనుక హిట్టు కొట్టిందంటే.. అమ్మడు రేంజు మరి మళ్ళీ ఒక రేంజుకు ఎదిగినట్లే. ప్రస్తుతానికైతే ఆన్ లైన్ బుకింగులు సినిమాపై ఏ రేంజు క్రేజ్ ఉందో చూపిస్తున్నాయి. వీటన్నింటినీ ఫస్ట్ డే టాక్ తో ప్లస్ పాయింట్లుగా మలుచుకోవాలి టీమ్. లెటజ్ సీ.

,  ,  ,  ,  ,