Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Mar-2017 14:06:17
facebook Twitter Googleplus
Photo

నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టు మొదలుపెడుతున్నాడనే న్యూస్ తప్ప.. ఇప్పటివరకూ ప్రకటన లేదు. ఉమెన్స్ డే సందర్భంగా ఆ కొరత తీర్చేస్తూ.. ఓ పోస్టర్ వేసేశారు. ఇందులో సావిత్రికి ఓ పక్క కీర్తి సురేష్.. మరోవైపు సమంత ఫోటోలను వేశారు.

ఇప్పటికే సావిత్రి పాత్రను కీర్తి సురేష్ చేయనుందనే విషయంలో క్లారిటీ ఉంది. కీర్తి కూడా ఈ విషయాన్ని కన్ఫాం చేసింది. మరి ఈ సినిమాలో సమంత పోషించే పాత్ర ఏంటన్నదే అసలు క్వశ్చన్. ఓ జర్నలిస్ట్ గా స్టోరీని నేరేట్ చేసే రోల్ అన్నారు కానీ.. అందులో నిజం లేదట. శామ్ కూడా కథలో కీలకమైన ఓ హిస్టారికల్ రోల్ నే చేస్తోందని తెలుస్తోంది. ఇంతకీ సమంత పోషించే పాత్ర ఏంటో తెలుసా.. అలనాటి నటి జమున రోల్ అని తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి.. సమంత పాత్రలు పోటాపోటీగా ఉంటాయని అంటున్నారు. ఇందుకు కారణం.. రియల్ లైఫ్ లో వీరిద్దరికీ అంతగా పడకపోవడమే.

మొదట్లో సన్నిహితంగానే వీరిద్దరి మధ్యా ఆ తర్వాత విబేధాలు తలెత్తాయి. సావిత్రి ఉన్న సినిమాలో తాను నటించబోనని బహిరంగంగానే చెప్పేశారు జమున. ఆ విబేధాలను కూడా మహానటిలో చూపించబోతున్నారట

,  ,  ,  ,  ,