Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Feb-2015 11:17:22
facebook Twitter Googleplus
Photo

తాను సినిమాల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా చెన్నయ్ బ్యూటీ సమంతా చాలా హ్యాపీ మూడ్ లో వుంది. ఆమె నటించిన తొలిచిత్రం 'ఏ మాయ చేశావే' రిలీజై సరిగ్గా ఇప్పటికి ఐదేళ్లయింది. దీంతో గత వారం రోజులుగా ట్విట్టర్ కి దూరంగా ఉంటున్న ఈ చిన్నది, ఆ సంతోషాన్ని, ఎగ్జయిట్ మెంటుని తట్టుకోలేక వెంటనే ట్వీట్ ఇచ్చింది. "సరిగ్గా ఐదేళ్లయింది. YMC (ఏ మాయ చేశావే) నాకు ఒక స్పెషల్ మూవీ. ఈ ఐదేళ్లూ ఒక అద్భుతమైన ప్రయాణంలా సాగింది. సినిమాల్లో భాగమైనందుకు గర్వంగా, ఆనందంగా వుంది" అంటూ పోస్ట్ ఇచ్చింది.

,  ,  ,  ,