Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2016 12:22:13
facebook Twitter Googleplus
Photo

ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ల లిస్టు తీస్తే ముందు మన టాలీవుడ్ దగ్గరికి రావాల్సిందే. అందులో కచ్చితంగా ఉండే పేరు జూనియర్ ఎన్టీఆర్. బాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా గుర్తింపున్న హృతిక్ సైతం మన తారక్ డ్యాన్సుకి ఫ్యాన్ కావడం విశేషం. ఐతే జూనియర్ డ్యాన్స్ చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ.. అతడి కలిసి స్టెప్పులేయడం మాత్రం చాలా కష్టమంటోంది సమంత. ట్విట్టర్లో అభిమానులతో జరిగిన చిట్ చాట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. మీరు డ్యాన్స్ చేయడానికి భయపడే హీరో ఎవరు అంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఠకీమని ఎన్టీఆర్ పేరు చెప్పేసింది.

??ఎన్టీఆర్ ఏదైనా డ్యాన్స్ మూమెంట్స్ ఒక్కసారి చూశాడంటే చాలు అలాగే గుర్తు పెట్టేసుకుంటాడు. ఏమాత్రం కష్టపడకుండా చాలా ఈజీగా స్టెప్పులు వేసేస్తాడు. అతడితో పాటు డ్యాన్స్ చేయడం చాలా చాలా కష్టం?? అంటూ జూనియర్ ను ఆకాశానికెత్తేసింది సమంత. తారక్ తో ఇప్పటికే బృందావనం.. రభస సినిమాల్లో నటించిన సమంత.. ప్రస్తుతం జనతా గ్యారేజ్ లోనూ అతడితో జత కడుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తారక్ మరోసారి తనదైన శైలిలో స్టెప్పులు అదరగొట్టేయబోతున్నాడని సమాచారం. తాను నటించిన హీరోల్లో బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆరే అని చెప్పేసిన సమంత.. బెస్ట్ కో స్టార్ ఎవరో చెప్పడానికి ఇష్టం లేదన్నట్లు మాట్లాడింది. మీకు చికాకు కలిగించే ప్రశ్న ఏదంటే.. ??మీ కోస్టార్లలో బెస్ట ఎవరు?? అని ఆమె చెప్పడం విశేషం.

,  ,  ,  ,  ,  ,