Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Feb-2017 11:04:03
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య.. సౌత్ బ్యూటీ సమంతల నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన బోలెడన్ని ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. సమంత కూడా అనేక పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. వీటిలో ఓ బుజ్జి పాప ఫోటో కూడా ఉంది. మీడియా ప్రసారం చేసిన వాటిలో కూడా ఈ చిన్నారి అందరినీ ఆకట్టుకుంది.

ఈ బుల్లిపాప డ్రస్ అంచులపై సమంత.. చెయ్ అని ఎంబ్రాయిడరీ కూడా చేసి ఉంటుంది. మరి చెయ్-సమంతల నిశ్చితార్ధ వేడుకలో ఇంతగా సంగడి చేసిన ఈ చిన్నారి ఎవరనే విషయం ముందు అందరికీ అర్ధం కాలేదు. ఈమె ఎవరో కాదు.. దగ్గుబాటి సురేష్ కి మనవరాలు. అంటే సురేష్ బాబు కూతురు మాళవిక-ఆమె భర్త బిజినెస్ మ్యాన్ అయిన భరత్ కృష్ణారావుల కుమార్తె ఈ చిన్నారి ఐరా. ఈ బుజ్జాయి తల్లి మాళవిక చైతుకు కజిన్. అంటే.. అంటే.. చైతు ఈమెకు బాబాయ్ అవుతాడన్న మాట. అలా ఈ బుజ్జిపాపకు తాను పిన్ని కాబట్టి.. 'మై డాల్' అంటూ సమంత సంబోధించింది.

మొత్తం దగ్గుబాటి ఫ్యామిలీ అంతా చెయ్-శామ్ ల నిశ్చితార్ధానికి వచ్చారు. అందరిలోకి ఈ ఏడాది వయసున్న చిన్నారి ఐరా చేసిన సందడి ఎక్కువగా ఆకట్టుకుంది.

,  ,  ,  ,  ,  ,