Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Aug-2017 13:53:25
facebook Twitter Googleplus
Photo

మాస్ ఇమేజ్ కోసం కాస్త తడబడ్డ అక్కినేని వారసుడు నాగ ఛైతన్య దాన్ని పక్కనబెట్టి లవ్ స్టోరీస్ తో ఎట్టకేలకు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తనకంటూ ఓ స్థాయిని తెచ్చుకున్న చైతు.. ప్రేమమ్- రారొండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస హిట్స్ అందుకొని ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు మరో సినిమాతో కాస్త మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని చూస్తున్నాను చైతు.

కృష్ణ మరిముత్తు అనే తమిళ దర్శకుడిని పరిచయం చేస్తూ.. "యుద్ధం శరణం" అనే క్రైం థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ త్వరలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహకాలు కూడా చేస్తుందట. ఎలాగైనా చైతు హ్యాట్రిక్ హిట్ కొట్టాలని హీరో నాగార్జున కూడా ఎప్పటికప్పుడు సినిమా గురించి దగ్గరుండి చూసుకుంటున్నారట. రీసెంట్ గా విఎఫ్ ఎక్స్ వర్క్స్ లో అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో నాగ్ చిత్ర యూనిట్ తో సమీక్ష జరిపారట.

అయితే ఈ సినిమా ఆడియో ను వినాయక చవితి సందర్బంగా ఆగస్టు 25 కు ఆడియోను రిలీజ్ చేసి.. ఆ తర్వాత సెప్టెంబర్ 8 న సినిమాను రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారట. దీంతో ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమా యూనిట్ షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉందట. ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా విడుదల చేసిన యుద్ధం శరణం సినిమా ట్రైలర్ కి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. కొన్ని యాక్షన్ తరహా సన్నివేశాలతో పాటు కుటుంబ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,