Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Nov-2015 13:35:59
facebook Twitter Googleplus
Photo

సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరిగిపోతోంది. నెక్ట్స్ షెడ్యూల్ లో జాయిన్ కావాల్సిదిగా రీసెంట్ గా హీరోయిన్ కి కూడా పిలుపొచ్చింది. ప్రస్తుతానికి హైద్రాబాద్ లో పలు యాక్షన్ కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా.. ఈ నెల 17నుంచి గుజరాత్ లో షూటింగ్ జరుపనున్నారు.

ఇప్పటికే సగానికి పైగా టాకీపార్ట్ పూర్తయిన సర్దార్ గబ్బర్ సింగ్ కి.. ఇప్పుడు రిలీజ్ డేట్ డిసైడ్ చేశాడు పవన్ కళ్యాణ్. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 2016న సర్దార్ ని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురానున్నారని తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే షూటింగ్ ప్రమోషన్ వర్క్స్ ప్లాన్ చేసుకుంటున్నారు యూనిట్. నిజానికి సర్దార్ షూటింగ్ జరుగుతున్న స్పీడ్ చూసి.. సంక్రాంతికే పవన్ వచ్చేస్తాడని టాలీవుడ్ భావించింది. అయితే పవన్ మాత్రం.. ఏ మాత్రం కంగారు అవసరం లేదని క్వాలిటీ - ప్రమోషన్ విషయంలో టైం తీసుకునైనా పర్ఫెక్ట్ గా ముందుకెళదామని సూచించాడట. దీంతో ఏప్రిల్ కే డిసైడ్ అయ్యారు.

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో.. సమ్మర్ కి వచ్చేలా ప్లాన్ చేసుకున్న మిగతా మూవీస్ కి కూడా డేట్ ఫైనల్ చేసుకునేందుకు తగినంతగా స్కోప్ ఏర్పడింది. మొత్తానికి సమ్మర్ హంగామా మాత్రం పవర్ స్టార్ తోనే షురూ కావడం ఖాయమైంది.

,  ,  ,